మీ సమస్యను పరిష్కరించే పూచి నాది : పవన్

Submitted by admin on Tue, 12/12/2017 - 11:04

పోలవరం, రాజమండ్రి పర్యటన ముగించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్  విజయవాడ చేరుకున్నారు.  హోటల్‌ మురళీ ఫార్చున్‌లో  బస చేసిన పవన్‌ కల్యాణ్‌ ఉదయం ఫాతిమా కాలేజ్‌ విద్యార్ధులతో భేటి అయ్యారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీకు ఎటువంటి విధంగా నష్టం జరగకుండా చూసే బాధ్యత తనదేనని వారికి భరోసా కల్పించారు ..దీనిపై మంత్రి కామినేని శ్రీనివాస్ తో మాట్లాడతానని మీకు తగిన విధంగా న్యాయం చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.. ఇటు పవన్‌ రాక సందర్భంగా  పెద్ద ఎత్తున అభిమానులు, జనసేన కార్యకర్తలు హోటల్‌ దగ్గరకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

English Title
sure-i-will-solve-your-problem-pawan

MORE FROM AUTHOR

RELATED ARTICLES