ఫొని తుపాను ఏపీలో మొదలైంది...

ఫొని తుపాను ఏపీలో మొదలైంది...
x
Highlights

ఫొని తుపాను ఏపీలో మొదలైంది. తీరప్రాంతాలైన నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నంతో పాటు మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. రాజమండ్రిలో...

ఫొని తుపాను ఏపీలో మొదలైంది. తీరప్రాంతాలైన నెల్లూరు, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నంతో పాటు మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. రాజమండ్రిలో చిరుజల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల అడపాడదపా వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫొని'తుపాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర పెనుతుపానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈనెల 3న మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

తుపాను ప్రభావం ఏపీపై తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెల 2,3 తేదీల్లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80-90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట , మందస, సంత బొమ్మాళి, పలాస , పొలాకి, నందిగాం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురం, చీపురుప ల్లి, డెంకాడ , గరివిడి, గుర్ల, నెల్లిమర్ల , పూసపాటిరేగ , ఇటు విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం ప్రాంతాలు ఫొని తుపాను తాకిడికి ప్రభావితం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories