విభజనలో లోపాలే ఇబ్బందులకు కారణం

విభజనలో లోపాలే ఇబ్బందులకు కారణం
x
Highlights

బీజేపీ హయాం లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,బీహార్ రాష్ట్రాలను విభజన చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా. వారి మనసులు గాయపడకుండా...

బీజేపీ హయాం లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,బీహార్ రాష్ట్రాలను విభజన చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా. వారి మనసులు గాయపడకుండా వ్యవహరించారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభాజన విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇది ఇప్పటికీ సమస్యగానే మిగిలింది. అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారణాసిలో ఏర్పాటు చేసిన బీజీపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించారు.

తనకు కార్యకర్తల మాటే వేదం అని ఈ సందర్భంగా చెప్పారు. గత నెల 25 న బహిరంగ సభ అనంతరం మళ్లీ నెల రోజుల తరువాతే నియోజకవర్గానికి విజయోత్సవానికి రావాలని కార్యకర్తలు కోరారు. ఆ విధంగానే నేను ఇప్పటివరకూ నియోజకవర్గంలో కాలు పెట్టలేదని చెప్పుకోచ్చారు. నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మండే ఎండలను సైతం పట్టించుకోకుండా బయటకు వచ్చి భాజపాకు ఓటేశారు. పార్టీ కార్యకర్తలు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఇంటి నుంచి ఒక మోదీ వచ్చి ప్రచారం చేశారు. అంటూ అయన కార్యకర్తలను కొనియాడారు.

రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ సరికొత్త మార్గాన్ని నిర్దేశించిందని.. 2014, 2017, 2019 ఎన్నికల్లో హాట్రిక్‌ విజయాలు సాధించడం చిన్న విషయం కాదని మోదీ అన్నారు. ఇంత జరిగినా రాజకీయ పండితుల ఇంకా కళ్లు తెరుచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లెక్కల కంటే నాయకులు, ప్రజల మధ్య బంధం ముఖ్యమని వారు ఇకనైనా తెలుసుకోవాలని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories