జగన్‌కు సీఎం అయ్యే అవకాశాలున్నాయి: కృష్ణ

Submitted by arun on Wed, 06/06/2018 - 14:12
ys jagan

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణను చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని.. సూపర్ స్టార్ కృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలు కురుస్తున్నా.. జగన్ తన పాదయాత్రను కొనసాగించారంటూ చెప్పారు. ఎక్కడ సభ నిర్వహించినా.. కిక్కిరిసిపోయిన జనం చూస్తే.. జగన్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు వచ్చినట్లే అని కృష్ణ తన మనస్సులో మాటను చెప్పారు. జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. ఇద్దరూ ఒకేసారి ఎంపీగా కలిసి పనిచేశామని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుమారుడిగా జగన్ రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారని.. అందులో ఎలాంటి సందేహం లేదని.. కృష్ణ చెప్పారు. 
 

English Title
Super Star Krishna Talk About Ys Jagan

MORE FROM AUTHOR

RELATED ARTICLES