సన్నీ వస్తే చస్తా..!

సన్నీ వస్తే చస్తా..!
x
Highlights

మొత్తానికి కన్నడిగులు అనుకున్నది సాధించారు. నీలి చిత్రాల చరిత్ర ఉన్న సన్నీ లియోన్‌ను కన్నడ నేలపై అడుగు పెట్టనివ్వరాదని రోడ్డెక్కిన ఆందోళనకారుల...

మొత్తానికి కన్నడిగులు అనుకున్నది సాధించారు. నీలి చిత్రాల చరిత్ర ఉన్న సన్నీ లియోన్‌ను కన్నడ నేలపై అడుగు పెట్టనివ్వరాదని రోడ్డెక్కిన ఆందోళనకారుల కోర్కెకి అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. బెంగలూరు న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొనాలనుకున్న సన్నీ లియోన్‌కి షాక్‌ తగిలింది.

మామూలుగా అయితే సన్నీ లియోన్‌ని ఫోటో చూసినా, సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించినా యూత్‌ కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు ఫీలవుతారు. ఇంతకాలం యూత్‌కి షాకిచ్చిన సన్నీకి కన్నడిగులు మొదటిసారిగా షాకిచ్చారు. బెంగలూరులో ఈ డిసెంబర్‌ 31 ఇయరెండ్‌ సెలబ్రేషన్స్‌కి సన్నీ లియోన్‌కి ఆహ్వానం ఉంది. నిజానికి సన్నీ లియోన్‌కి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ ఇన్విటేషన్స్‌ కోకొల్లలున్నాయి. అయితే హైదరాబాద్‌, బెంగలూరు ఈవెంట్స్‌కి మాత్రమే సన్నీ ఓకే చెప్పింది.

న్యూఇయర్‌ వేడుకల కోసం సన్నీ లియోన్‌ బెంగలూరు వస్తుందని తెలియగానే అక్కడి వారు ఆనందంతో ఎగిరి గంతేయలేదు. సన్నీలాంటి వివాదాస్పద చరిత్ర ఉన్న నటి బెంగలూరు రావొద్దని ఆందోళనలు మొదలయ్యాయి. కర్నాటక రక్షణ వేదిక వంటి సంస్థలు రోడ్డెక్కి ఆందోళనలకి దిగాయి.

ఇప్పటికే బెంగలూరు నగరంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కామాంధులు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదని ఆందోళన కారులు అంటున్నారు. సన్నీ లాంటి చెడు చరిత్ర ఉన్న మహిళతో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే పరిస్థితులు మరింత క్షీణిస్తాయని మండిపడ్డారు.
2018 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి బెంగలూరులోని మన్యతా టెక్‌ పార్క్‌లో ఓ ప్రైవేటు షో ఏర్పాటు చేశారు. అది ప్రైవేటు షో అయినా.. కూడా సన్నీ వచ్చిందంటే దాని ప్రభావం నగర యువత మీద పడుతుందని నిరసన కారుల వాదన.

సన్నీ కోసం చచ్చిపోతామనే కుర్రాళ్లున్నారు సన్నీ వస్తే చచ్చిపోతామనే కన్నడ యువతను చూసి అంతా ఆశ్చర్యపోయారు. అసభ్య నృత్యాలకు కేరాఫ్‌ ఎడ్రస్‌గా ఉన్న సన్నీని బెంగలూరులో అడుగు పెట్టనీయబోమన్న కన్నడ ఆందోళన కారులు మొత్తానికి సాధించారు.

సన్నీ లియోన్‌ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చినా ఆ విషయం బయటికొస్తే దానవాలంగా వ్యాపిస్తుంది. నాలుగు గోడల మధ్యనో, కాంపౌండ్‌ వాల్‌ మధ్యనో సన్నీ ప్రోగ్రామ్‌ ఇచ్చినా నగర యువత సూదంటు రాయిలా వచ్చేస్తారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి సన్నీని పిలిచారంటే ఆమెతో ఎలాంటి డ్యాన్స్‌లు చేయిస్తారో అనే అనుమానం కన్నడిగులను ఆందోళనకి గురి చేసింది.

సన్నీ వచ్చేది ప్రైవేటు కార్యక్రమని, ఆమెతో ఎలాంటి అసభ్య నృత్యాలు చేయించబోమని నిర్వహాకులు ఇచ్చినా హామీ కూడా కన్నడిగులను సంతృప్తి పరచలేకపోయింది. గతంలో పొరుగునే ఉన్న కేరళకి సన్నీ వచ్చినప్పుడు ఆమెను చూడ్డానికి వచ్చిన జన సందోహాన్ని కన్నడిగులు మర్చిపోలేదు. ఇక్కడ కూడా కన్నడ యూత్‌ అలానే కిర్రెక్కిపోతారని భయపడ్డారు.

షకీలా వంటి నీలి చిత్రాల సూపర్‌ యాక్ట్రెస్‌కి బ్రహ్మరథం పట్టిన మళయాళ ప్రేక్షకులకు సన్నీ లియోన్‌ వచ్చిందంటే పెద్ద పండగే అలాంటి పరిస్తితే బెంగలూరులోనూ రిపీటవ్వద్దనే ఆందోళనకారుల డిమాండ్‌కి ప్రభుత్వం తలొగ్గింది. సన్నీ వస్తే సామూహిక ఆత్మహత్యలకు సిద్ధపడతామని హెచ్చరికలతో ఎలర్ట్‌ అయింది. సన్నీ ప్రోగ్రామ్‌కి అనుమతి క్యాన్సిల్‌ చేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు తగిన కార్యక్రమాలను న్యూఇయర్‌ ఈవెంట్‌లో నిర్వహించుకోవాలని కర్నాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

గతంలో కన్నడ సినిమా శేషమ్మలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన సన్నీకి కన్నడ ప్రేక్షకులు ఫ్యాన్స్‌ అయ్యారు. సన్నీ రీల్‌ లైఫ్‌ లోంచి రియల్‌ లైఫ్‌లో వస్తే బెంగలూరులో మరెంత రెస్సాన్స్‌ వచ్చేదో కానీ ప్రభుత్వ జోక్యంతో ఆగిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories