మనసును కదిలిస్తున్న సన్నీలియోని ట్వీట్‌

Submitted by arun on Sat, 04/14/2018 - 16:20
 Sunny Leone

జమ్ముకశ్మీర్లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికని లైంగికంగా వేధించి ఆ తర్వాత బండరాయితో మోది చంపడం అందరిని కలిచి వేసింది. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ దారుణ సంఘటనని వ్యతిరేఖిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. తన కూతురు(దత్త పుత్రిక) నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘తల్లీ.. నేను నీకు ప్రామిస్‌ చేస్తున్నా. నా హృదయం, ఆత్మ, దేహం... ఇవన్నీ నిన్ను రక్షించుకునేందుకే. ఈ లోకంలో చెడు పెరిగిపోయింది. అందుకే నీ కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తుంటా. నీ రక్షణ కోసం నా ప్రాణాలైన పణంగా పెడతా. ప్రస్తుతం చిన్నారులకు సైతం రక్షణ అనేదే లేకుండా పోయింది. కాబట్టి వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ఓ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌కు సానుకూలంగా స్పందన వస్తోంది.

English Title
sunny leone tweet kathua rape case

MORE FROM AUTHOR

RELATED ARTICLES