సెక్సీబాంబ్‌ దెబ్బకు గూగుల్‌ సైతం గ‌జ‌గ‌జ

Submitted by arun on Sun, 12/17/2017 - 12:47
Sunny Leone

సెక్సీక్యూన్‌ కోసం పెద్దయుద్దమే నడించింది. సెక్సీబాంబ్‌ దెబ్బకు గూగుల్‌ సైతం గ‌జ‌గ‌జ ఒణికిపోతుంది. అందగత్తెలను సైతం వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలించింది. హీరోలను సైతం తన అందాలతో వణికించి టాప్‌ఫ్లేస్లో నిలిచింది. ఆ భామ ఎవరో  తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. 

 సన్నీ లియెన్‌ ఆ మాట వింటే చాలు కుర్రకారుల్లో వెబ్రేషన్స్  మొదలవుతాయి. చిన్నదాని చూపు కోసం పడిచచ్చిపోతారు. అలాంటి  సెక్సీ క్వీన్‌  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సన్నీ ఎక్కడకు వెళ్లినా కుర్రకారు ఆమెను చూసేందుకు క్యూ కడతారు. ఇండస్ట్రీలో ఎంత మంది తారలున్నా సన్నీ లియోనుకు ఉన్న సెక్సీ ఫాలోయింగ్‌ సపరేటనే చెప్పాలి.  

 సన్నీ గురించి ఆరా తీయడంలో యువత ఎంతో ఆసక్తి చూపుతోంది. పైగా ముద్దుగుమ్మకు సంబంధించిన ప్రతివిషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారట. అందుకే బాలీవుడ్‌లో ఎంతమంది బ్యూటీలో ఉన్నా సన్నీ కోసం గూగుల్‌ లో వెతికారు. దీంతో  యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 

2017 లో అత్యధికంగా వెతికినా గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్‌ లీస్ట్‌లో సన్నీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది, దీపికా పదుకొనే, ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌లాంటి స్టార్‌ హీరోయిన్‌లను దాటుకొని మోస్ట్‌ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ జాబితాలో టాప్‌లో నిలిచింది. ఈ జాబితాలో మరో బాలీవుడ్‌ భామ దిశా పటానీ ఐదో స్థానం దక్కించుకోగా బాహుబలితో భళ్లాలదేవుడిగా నేషనల్‌ లెవల్‌గా  గుర్తింపు తెచ్చుకున్న రానా  పదో స్థానంలో నిలిచాడు. 

మొత్తానికి బాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే కాదు గూగుల్‌ను సైతం  దున్నేస్తోందీ ముద్దుగుమ్మ. తన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో  రికార్డను క్రియేట్‌ చేసుకుంటూ హీరోలను సైతం భయపెడుతోంది బ్యూటీ. ముందు ముందు మరెన్ని రికార్డు బద్దలు కొడుతుందో చూడాలి.

English Title
Sunny Leone is at the top of the most searched entertainers in India on Google this year too

MORE FROM AUTHOR

RELATED ARTICLES