కుప్పంలో టీడీపీ అధినేతకు వచ్చే మెజార్టీ ఇదేనా? లెక్క తప్పదేలేదంటున్న టీడీపీ

కుప్పంలో టీడీపీ అధినేతకు వచ్చే మెజార్టీ ఇదేనా? లెక్క తప్పదేలేదంటున్న టీడీపీ
x
Highlights

ఏపీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అందరీ చూపు ఏపీ ఫలితాలపైనే. ఏపీలో ఎవరు విజేతగా ఎవరు నిలుస్తారు. పరుజీతులుగా ఎవరు మిగలబోతున్నారని ఇటు...

ఏపీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు అందరీ చూపు ఏపీ ఫలితాలపైనే. ఏపీలో ఎవరు విజేతగా ఎవరు నిలుస్తారు. పరుజీతులుగా ఎవరు మిగలబోతున్నారని ఇటు పార్టీలు, అటు జనాల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఫలితాలు వెలువడానికి సరిగ్గా మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక దీంతో ఫలితాలను అంచనా వేయడంలో రాజకీయ పార్టీలు, నేతలు నిమగ్నమైపోయారు. ఇక బెట్టింగ్ రాయుళ్లు సైతం తమ రేంజ్‌కు తగ్గట్టుగా పందేలు కాస్తున్నారు. ఇక రోజులు గడుస్తున్నాకొద్ది అభ్యర్థుల్లో అంతకంతకూ టెన్షన్ పెరుగుతోంది. అసలు ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా నేతలు ఎవరి పార్టీ నేతలు వారే లెక్కలేసుకుంటున్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిబూత్‌ల వారీగా ఓట్ల అంచనాలు వేసుకుంటూ గెలుపోటములపై విశ్లేషించుకుంటున్నారు. అయితే ఆయా పార్టీల వారు తామ పార్టీపోటీ చేసిన నియోజకవర్గాల వారిగా సర్వేలు తెప్పించుకుంటున్నారు.

ఇక ఈసారి కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బరిలో దిగిన విషయం తెలిసిందే కాగా అసలు చంద్రబాబు నాయుడు ఎంత మెజారీటీతో గెలువబోతున్నారన్న దానిపై ఆ పార్టీ ఇప్పటికే జోరుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బేటీ అయినా సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో మెజార్టీ అంశం ప్రస్తావన లెవనెత్తింది. కాగా కుప్పం నియోజకవర్గంలో ఈ సారి మీరు కనీసం 79 వేల మెజార్టీతో గెలుస్తారని అక్కడి టీడీపీ నాయకులు చంద్రబాబుకు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎంత ఆధిక్యం లభించనుందీ లెక్కలతో వివరించారు. కొంతమంది అభ్యర్థులు కూడా ఇదే తరహాలో పోలింగ్‌ కేంద్రాల వారీగా, మొత్తం ఓట్లు, పోలైనవి, టీడీపీకే పడే అవకాశమున్నవి అంటూ వివరాలు అందజేశారు. కానీ నారా చంద్రబాబు మాత్రం సంతృప్తి చెందలేదని తెలిసింది. ప్రతి వార్డుల్లో పర్యటించి వివరాలు సేకరించాలని పార్టీనేతలకు చంద్రబాబు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ మనమే అధికారంలోకి వచ్చితీరుతామని అభ్యర్థులకు చంద్రబాబు చెప్పారు. గత2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 47,121 మెజార్టీతో గెలిచారు. చంద్రబాబుకు 1,02,952 ఓట్లు పోలవగా వైసీపీ పార్టీ అభ్యర్థి చంద్రమౌళికి 55,839 ఓట్లు పడ్డాయి. ఐతే ఈసారి వైసీపీ సైతం కుప్పం నియోజకవర్గమే టార్గెట్‌గా తీసుకుంది. ఇక మే 23న ఫలితాలు రానున్నాయి. మరి విజేతగా ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుంద్నది ఆ రోజే తెలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories