ఆకలి బాగా వేయాలంటే...

ఆకలి బాగా వేయాలంటే...
x
Highlights

ప్రస్తుత జీవనశైలిలో చాలి మంది సరియైన డైట్‌ను మెయింటైన్ చేయరు. సరియైన సమయానికి తిందాం అనుకున్నప్పటికీ ఆకలి వేయదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు...

ప్రస్తుత జీవనశైలిలో చాలి మంది సరియైన డైట్‌ను మెయింటైన్ చేయరు. సరియైన సమయానికి తిందాం అనుకున్నప్పటికీ ఆకలి వేయదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులుంటారు. ఎవరు ఎంత చెప్పినా అహార నియమాలను పాటించరు. సరియైన డైట్‌ లేకపోవడం వల్ల నీరసం, అలసట రావడం. అనారోగ్య గురవడం లాంటివి చాలా మందికి ఎదురవుతున్న సమస్యలు . ఇలాంటివారు చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే చాలు ఆకలి కలుగుతుంది. ఆ చిట్కాలేంటో ఓ సారి చూద్ధాం.

* ఒక టీ స్పూన్‌ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిసి పది రోజుల పాటు భోజనానికి ముందు తీసుకున్నట్టయితే ఆకలి బాగా వేస్తుంది.

* ఒక టీ స్పూన్ బెల్లంపొడి, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడిగల మిశ్రమాన్ని ప్రతి రోజూ తీసుకుంటే ఆకలి బాగా వేస్తుంది.

* భోజనానికి ముందు రెండు లేదా మూడు యాలకుల గింజలను తీసుకోవాలి. వాటి వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాదు ఆకలి కూడా కలుగుతుంది.

* ఒక కప్పులో నీటిలో ఉసిరిక్కాయ రసం, నిమ్మరసం, తేనెలను కలుపుకుని రోజుకు 2 టీ స్పూన్ల చొప్పున ప్రతి రోజూ ఉదయం పరగడపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆకలి బాగా వేస్తుంది.

* నిమ్మరసంలో వామును కలిపి ఎండలో పెట్టాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నల్ల ఉప్పును కలిపి దాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఆకలి

కలుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories