‘రంగస్థలం’ వివాదంపై స్పందించిన సుకుమార్‌

‘రంగస్థలం’ వివాదంపై స్పందించిన సుకుమార్‌
x
Highlights

‘రంగస్థలం’లోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో యాదవ మహిళలకు కించపరిచేలా పదాలు ఉన్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అభ్యంతరం తెలిపిన...

‘రంగస్థలం’లోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో యాదవ మహిళలకు కించపరిచేలా పదాలు ఉన్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లైన్‌ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారు. అయితే దీనిపై ఆ సినిమా దర్శకుడు స్పష్టత ఇచ్చారు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను ఉద్దేశించి వాడలేదని అదొక పురుగులాంటింద‌ని, ఇది అందరికీ తెలిసే ఉంటుందని సుకుమార్ ఓ ప్రెస్ మీట్‌లో తెలిపాడు. మ‌రి సుకుమార్ స‌మాధానంతో యాద‌వ్ హ‌క్కులు పోరాట స‌మితి సంతృప్తి చెందుతుందో చూడాలి. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందిచగా, మానసి పాడారు. చరణ్‌ని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్స్‌ కూడా ఈ పాటకు హైలెట్‌గా నిలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories