వైఎస్ఆర్ బయోపిక్ .. సబితగా సుహాసిని!

Submitted by arun on Fri, 06/15/2018 - 12:17
ysr biopic

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను యాత్ర' పేరుతో తెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కనిపించనున్నారు. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటించనున్నారు. ఇక వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్‌లోకి సీనియర్ నటి, దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రను ఆమె పోషించనున్నారు.  ‘ఆనందోబ్రహ్మ’ ఫేమ్ మహీ రాఘవ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు.
 

English Title
suhasini play Sabitha Indra Reddy role in ysr biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES