అందుకే కళ్యాణ్ రామ్ పోటీ చేయలేదు.. రేపే సుహాసిని నామినేషన్..

అందుకే కళ్యాణ్ రామ్ పోటీ చేయలేదు.. రేపే సుహాసిని నామినేషన్..
x
Highlights

తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్‌పల్లి అసెంబ్లీకి టీడీపీ తరుపున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఆ...

తెలంగాణ ఎన్నికల సందర్బంగా కూకట్‌పల్లి అసెంబ్లీకి టీడీపీ తరుపున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఆ పార్టీ. ఈ స్థానాన్ని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డి ఆశించారు. మూడు రోజులకిందటి వరకు టికెట్‌ తనకే వస్తుందనే ఆలోచనతో ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సుహాసిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి పెద్దిరెడ్డికి మొండిచేయి చూపారు. ఇదే స్థానాన్ని ఆశించిన మరో నేత మందాడి శ్రీనివాసరావును కూడా బుజ్జగించి సుహాసినికి టికెట్‌ కేటాయించారు. కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆమె శనివారం నామినేషన్ వేయనున్నారు. ఇదిలావుంటే మొదట్లో సినీనటుడు నందమూరి కళ్యాణ్ రామ్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. శేరిలింగంపల్లి లేదా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే సినిమాల్లో తాను బిజీబిజీగా ఉండటం కారణంగా పోటీకి ఆసక్తి చూపలేదని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ క్రమంలోనే సుహాసినిని బరిలోకి దింపుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories