రాహుల్ పెళ్లి గురించి సోనియాకు ఓ సలహా ఇచ్చా..ఆ అమ్మాయితో పెళ్లి చేస్తే...: జేసీ

Submitted by arun on Fri, 07/06/2018 - 14:37
jc

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ మంత్రిగా చేసిన ఆయన .. అప్పటి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘రాహుల్ ప్రధాని కావాలంటే ఉత్తరప్రదేశ్‌లో బలమైన సామాజిక వర్గం అయిన బ్రాహ్మణుల మద్దతు కావాలని నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సోనియా గాంధీకి చెప్పాను. యూపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నది డిసైడ్ చేయడంలో బ్రాహ్మణ సామాజిక వర్గమే కీలకం. అందుకే బ్రాహ్మణ అమ్మాయిల్లో మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసి రాహుల్‌కి ఇచ్చి పెళ్లి చేయమని సోనియా గాంధీకి సలహా ఇచ్చా. కానీ, అప్పుడు ఆమె నా మాట వినలేదు.’’ అంటూ అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని జేసీ దివాకర్‌రెడ్డి బయటపెట్టారు.

English Title
Suggested Sonia Gandhi to get Rahul married to a 'good Brahmin girl' but she didn't agree: TDP MP

MORE FROM AUTHOR

RELATED ARTICLES