మ‌రో రీమేక్‌లో సుదీప్‌

మ‌రో రీమేక్‌లో సుదీప్‌
x
Highlights

'ఈగ' చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. క‌న్న‌డ చిత్రాల్లో హీరోగా న‌టించే సుదీప్ తాజాగా ఓ రీమేక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని...

'ఈగ' చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. క‌న్న‌డ చిత్రాల్లో హీరోగా న‌టించే సుదీప్ తాజాగా ఓ రీమేక్‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించిన 'విక్ర‌మ్ వేద' ఆధారంగా ఈ క‌న్న‌డ సినిమా తెర‌కెక్క‌నుంది. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.
రీమేక్ చిత్రాల్లో న‌టించ‌డం సుదీప్‌కి ఇదే తొలిసారి కాదు. 'విక్ర‌మార్కుడు', 'ల‌క్ష్యం', 'మిర్చి', 'అత్తారింటికి దారేది' వంటి తెలుగు చిత్రాలను.. 'సింగం' లాంటి త‌మిళ చిత్రాల‌ను క‌న్న‌డంలోకి రీమేక్ చేసి న‌టించిన అనుభ‌వం ఉంది సుదీప్‌కి. ఆ మ‌ధ్య 'బాహుబ‌లి'లో సుదీప్ అతిథి పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories