రణరంగంగా ముంబై

రణరంగంగా ముంబై
x
Highlights

ముంబై మళ్లీ హోరెత్తుతోంది. నినాదాలతో దద్దరిళ్లుతోంది. మొన్నటివరకు రైతుల ఆందోళనలతో అట్టుడికిన ముంబై మహానగరం తాజాగా రైల్వే ఉద్యోగాల కోసం పోరాడుతున్న...

ముంబై మళ్లీ హోరెత్తుతోంది. నినాదాలతో దద్దరిళ్లుతోంది. మొన్నటివరకు రైతుల ఆందోళనలతో అట్టుడికిన ముంబై మహానగరం తాజాగా రైల్వే ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగుల ఆందోళనతో అట్టుడికిపోతోంది. రైల్వే పోస్టుల కోసం పరీక్షలు రాసిన అభ్యర్థులు నియామకాలు కోరుతూ ఇవాళ భారీ ఆందోళనను చేపట్టారు. మతుంగ, ఛత్రపతి శివాజీ టెర్మినల్ల మధ్య భారీ నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైలు పట్టాలపైనే నిరసన చేపట్టడంతో 60 కి పైగా లోకల్ రైళ్లను అధికారులు రద్దు చేశారు.

గత కొంతకాలంగా రైల్వే ఉద్యోగాల కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పరీక్షలు రాశారు. అయితే ఇప్పటివరకు వాటికి సంబంధించిన నియామకాలు చేపట్టలేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న అభ్యర్థులు ఇవాళ పట్టాలపైకి వచ్చారు. ట్రాక్స్ పైనే కూర్చొని తీవ్ర నిరసన తెలిపారు. రైల్వే వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో ముంబై రైల్వే వ్యవస్థ కొంతమేర స్తంభించింది.

మరోవైపు ఆందోళనలతో ముంబై జనజీవనం కాస్త స్తంభించింది. ముఖ్యంగా విధులకు హాజరుకావాల్సిన ఉద్యోగులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం ముంబై సెంట్రల్ లైన్ మీద నుంచే 50 లక్షలకు పైగా మంది ప్రయాణం చేస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీకి దిగారు. అయితే నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories