జగిత్యాల విద్యార్థుల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్...సినిమా ఎఫెక్ట్‌తో బలైన ప్రాణాలు

జగిత్యాల విద్యార్థుల ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్...సినిమా ఎఫెక్ట్‌తో బలైన ప్రాణాలు
x
Highlights

జగిత్యాల జంట మరణాల కథ.. అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ఆత్మహత్యల వెనుక ఈ మధ్యే వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ.. ఆర్‌ ఎక్స్ హండ్రెడ్‌ కాన్సెప్ట్‌ ఉందని.....

జగిత్యాల జంట మరణాల కథ.. అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ఆత్మహత్యల వెనుక ఈ మధ్యే వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ.. ఆర్‌ ఎక్స్ హండ్రెడ్‌ కాన్సెప్ట్‌ ఉందని.. పోలీసుల విచారణలో తేలింది. రవితేజ, మహేందర్‌ లు ఇద్దరూ అమ్మాయిలతో చాటింగ్‌ చేసేవారన్న జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ.. ఇవి కేవలం ఆత్మహత్యలే కాదని స్పష్టం చేశారు. మహేందర్‌ గతంలో ఆర్‌ ఎక్స్ హండ్రెడ్‌ మూవీ హీరోలా చనిపోతానంటూ చాలా సార్లు అన్నట్లు విచారణలో తేలిందని.. చెప్పారు. ఆ సినిమాలోని హిట్‌ సాంగ్‌ను ఎక్కువగా వినే మహేందర్‌.. మత్తుకు అలవాటు పడ్డాడని తెలిపారు.

ఆదివారం రాత్రి జగిత్యాల మిషన్‌ కాంపౌండ్‌లోని నిర్మాణుష్య ప్రదేశంలో రవితేజ, మహేందర్‌ ఇద్దరూ మందుకొట్టి.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మహేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రవితేజ మాత్రం కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించారని.. తమ ప్రేమ విషయాన్ని చెప్పలేక.. ఇద్దరూ కలిసి ప్రాణాలు తీసుకున్నారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఇవి కేవలం ఆత్మహత్యలు మాత్రమే కావని.. తేల్చిచెప్పారు.. పోలీసులు.

తీవ్ర కలకలం సృష్టించిన ఆత్మహత్యలపై జగిత్యాల పోలీసులు విచారణ చేపట్టారు. స్పాట్‌లో దొరికిన సెల్‌‌ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటు విచారణలో పలు కీలక ఆధారాలను సేకరించారు. ఆత్మహత్యకు ముందు ఓ బంకులో పెట్రోల్ కొనుగోలు చేశారు. పెట్రోల్ కొనుగోలు చేసి వెళ్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో స్ధానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంకు నుంచి పెట్రోల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత మిషన్ కాంపౌండ్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అయితే రవితేజ, మహేందర్‌లవి.. కేవలం ఆత్మహత్యలే కావని.. డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఆర్‌ ఎక్స్‌ హండ్రెడ్‌ మూవీ కాన్సెప్ట్‌ ఉందని.. సంచలన విషయాన్ని చెప్పారు. రవితేజ, మహేందర్‌.. రెగ్యులర్‌గా అమ్మాయిలతో చాటింగ్‌ చేసేవారని.. చెప్పారు. అందులో భాగంగానే.. వీరిద్దరూ ప్రాణాలు తీసుకున్నట్లు వెంకటరమణ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories