ఏటా 18 లక్షల మంది మృత్యుఒడికి...

ఏటా 18 లక్షల మంది మృత్యుఒడికి...
x
Highlights

రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి నుండి బయటికి రాకుండా ఇంటికే పరిమితం...

రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా బడులకు సెలవులు ప్రకటించేఅంతగా. ఇంటి నుండి బయటికి రాకుండా ఇంటికే పరిమితం కావాలని పిల్లలకు ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారిచేసింది. ఇక ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులైతే కాలుష్యం నుండి కొద్దిపాటి ఉపశమనం కోసం మెడికల్ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారి చేశారు. అసలు వాతావరణ కాలుష్యానికి అంతా ఇంత కాదు ఒక్క భారతదేశంలో వాయు కాలుష్యం కారణంగా ఏటా 18లక్షల మంది నవాజాత శిశువులు, పసిపిల్లులు మరణిస్తున్నరని లాన్ సెట్ మాగజైన్ నివేదిక వెల్లడించింది. భారత్ లోనే కాలుష్య మరణాల సంఖ్య అధికమని, ప్రపంచవ్యాప్తంగా కాలుష్యనగరాలను గుర్తింపులో అందులో 14 నగరాలు భారత్ లోనే ఉన్నాయి. అవి అగ్రస్థానంలో ఢిల్లీ, వారణాసి, పట్నా నగరాలు ఉన్నాయి. వాయు కాలుష్యం భారత్ లోనే కాకుండా ప్రపంచ దేశాలను అందులో ఆసియా దేశాలను విడటంలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా కాలుష్యం వల్ల 70లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలో పీఎం 2.5 అతిచిన్న ధూళి కణాల వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్, గుండె జబ్బులు, కాలేయం క్యాన్సర్‌ చే మృత్యువాత పడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories