15 మంది సభ్యులతో టీడీపీ మేనిఫెస్టో కమిటీ

15 మంది సభ్యులతో టీడీపీ మేనిఫెస్టో కమిటీ
x
Highlights

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజల ముందుంచే హామీల సమాహారం మేనిఫెస్టోను రూపొందించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీనికి సంబంధించి మేనిఫెస్టో కమిటీని...

మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజల ముందుంచే హామీల సమాహారం మేనిఫెస్టోను రూపొందించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీనికి సంబంధించి మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. గత ఎన్నికల్లో 600 హామీలను ప్రకటించగా వాటిని తలదన్నే పథకాలను రూపకల్పనకు కమిటీ రెడీ అవుతోంది. ఆర్థిక మంత్రి యనమల నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం వివిధ వర్గాలతో భేటీ కానుంది.

15 మంది సభ్యులతో కూడిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో ఏడుగురు మంత్రులు కాగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో పాటు మరో ఏడుగురు పార్టీ నాయకులకు చోటు కల్పించారు. ఈ బృందానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వం వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం మేనిఫెస్టో కమిటీ సచివాలయంలోని ఆర్థిక మంత్రి ఛాంబర్ లో తొలి భేటీ కానుంది.

గత ఎన్నికల్లో 600 హామీలను టీడీపీ మ్యానిఫెస్టో కమిటీ ప్రకటించింది. వీటిలో కీలకమైన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాపు రిజర్వేషన్లు, కార్పొరేషన్‌ల ఏర్పాటు వంటి హామీలతో ఆకట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆర్థికలోటుతో తన పాలనా ప్రయాణాన్ని మొదలుపెట్టిన టీడీపీ హామీ ఇవ్వని పలు సంక్షేమ పథకాలను చేపట్టి వివిధ వర్గాలకు చేరువైంది. ముఖ్యంగా పెన్షన్ల రెట్టింపు, పసుపు-కుంకుమ కింద పదివేలు సాయం, అన్నదాత సుఖీభవ పథకం కింద కుటుంబానికి 15 వేలు, కేంద్ర సాయం అందని వారికి 10 వేలు అందించడం, నిరుద్యోగ భృతి వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడం వంటి పథకాలను అందిస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు సంక్షేమంపై వెచ్చించింది.

అయితే రానున్న ఎన్నికల్లో వర్గాల వారిగా ఎటువంటి పథకాలు ప్రకటించాలి..? ఏవిధంగా అమలు చేస్తారనే దానిపై పలు సంఘాలతో మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలు తీసుకోనుంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏవేవి కొనసాగించాలి..? అనేదానిపైనా కమిటీ దృష్టి సారించనుంది. వ్యక్తిగత లభ్దితో పాటు, సామూహిక లబ్దికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కమిటీకి సూచించారు. అలాగే రాష్ట్రం రెండంకెల వృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంతోపాటు విజన్ 2019-2024 లోని కీలక అంశాలకు కమిటీ ప్రాధ్యానత ఇచ్చి వీలైనంత త్వరలోనే చంద్రబాబుకు నివేదిక అందించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories