ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ్ దేవరకొండ హీరోయిన్

ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ్ దేవరకొండ హీరోయిన్
x
Highlights

తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య మెల్లగా హీరోయిన్ గా మారి...

తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య మెల్లగా హీరోయిన్ గా మారి మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమిళంలో పెద్ద స్టార్స్ తో నటించిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో నటించడానికి రెడి అవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను నటించిన 'సామి 2' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఐశ్వర్య.

"ఆ సినిమాను నేను మొదట చేయకూడదు అనుకున్నాను. చాలా మంది హీరోయిన్స్ ఆ పాత్రకు నో చెప్పారు. కాని కొందరు నన్ను వ్యక్తిగతంగా కోరడం వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది." అని చెప్పిన ఐశ్వర్య ఇక నుండి రెండు రొమాంటిక్ సీన్లు రెండు పాటల్లో కనిపించే పాత్రలను మరెప్పుడు ఒప్పుకోనని స్పష్టం చేసింది. సినిమాలో తన పాత్ర కీలకం అయితేనే నటిస్తానని క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. ఈమధ్యనే విజయ్ దేవరకొండతో ప్రేమ పెళ్లి అంటూ వచ్చిన పుకార్లలో నిజం లేదని కొట్టి పారేసిన ఈమె ఇప్పుడిలా సామి 2 చిత్రంపై కామెంట్స్ చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories