క‌న్నుల పండువ‌గా శ్రీరామ‌న‌వ‌మి

క‌న్నుల పండువ‌గా శ్రీరామ‌న‌వ‌మి
x
Highlights

రామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ...


రామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు.

శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.
ఇదిలా ఉంటే శ్రీరామనవమి పండుగ ఎప్పుడు.. ఏ తేదీన జరుపుకోవాలి.. ఎందుకీ కన్ఫ్యూజన్.. ఇలాంటి ప్రశ్నలు వేధించాయి. తెలంగాణ రాష్ట్రం 26వ తేదీని శ్రీరామనవమి పండుగ చేసుకోవాలని ప్రకటించింది. భద్రాద్రిలో కూడా 26వ తేదీనే కల్యాణం చేస్తున్నారు. అష్టమితో కలిసి వచ్చిన నవమి పనికిరాదని, ధర్మసింధు ఇదే స్పష్టం చేస్తోందని కొందరు పండితులు చెబుతున్నారు. ఆ ప్రకారమే భద్రాచలంలోని 26వ తేదీనే భద్రాద్రిలో సీతారామకల్యాణం జరిపించడానికి ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం 25వ తేదీని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా 25న వేడుకలు నిర్వ‌హించింది. నవమి తిథి ఈనెల 25న సూర్యోదయం అయ్యాక వస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే ముగిసి.. సూర్యోదయ సమయానికే దశమి వచ్చేస్తుంది. 26వ తేదీ సూర్యోదయానికి ముందే నవమి వెళ్లిపోతోంది కాబట్టి.. 25వ తేదీనే నవమి వేడుకలు నిర్వహించాలని ధర్మసింధు చెప్పింది. టీటీడీతోపాటు ఏపీ ప్రభుత్వం అదే చెప్పింది. కాబ‌ట్టే ఏ రాష్ట్రం నిర్ణ‌యించిన స‌మ‌యానికే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories