శ్రీనివాస కళ్యాణం ఎఫెక్ట్.. దిల్ రాజు షాకింగ్ నిర్ణయం..?

Submitted by arun on Mon, 08/13/2018 - 17:07
dil raju

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి టాకే వస్తున్నప్పటికీ యూత్ నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. తమ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందని భావించిన దిల్ రాజు అండ్ టీమ్ ఈ పరిణామాలతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమాకి ఫస్ట్ డే వచ్చిన టాక్ విని దిల్ రాజు షాకయ్యాడట. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడంతో అసలు ఫ్యామిలీ సినిమాలు తీయడం ఆపేద్దామా అని అనుకున్నారట. కానీ.. రెండు రోజుల తర్వాత సినిమాని ప్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారని.. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయని తెలిసి సంతోషంగా ఫీలైనట్లు తెలిపారు.  ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రాల్లో ఫ్యామిలీ సినిమాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. 

English Title
srinivasa-kalyanam-effect-dil-raju-shocking-decession

MORE FROM AUTHOR

RELATED ARTICLES