శ్రీదేవి అంత్యక్రియల్లో నవ్వులా ?

Submitted by arun on Fri, 03/02/2018 - 12:08
Jacqueline fernandez

అందాలనటి శ్రీదేవి మ‌ర‌ణ వార్త బాలీవుడ్‌నే కాదు.. యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు సైతం శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేక‌పోయారు. శ్రీదేవి మృత‌దేహం భార‌త్‌కు రాగానే నివాళుల‌ర్పించేందుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్ నుంచి ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు ముంబై త‌ర‌లి వెళ్లారు. సుస్మితాసేన్‌, అమితాబ్‌, శ్ర‌ద్ధా క‌పూర్ వంటి నటులు శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసి విల‌పించారు. అయితే శ్రీదేవికి నివాళుల‌ర్పించ‌డానికి వ‌చ్చిన ఓ హీరోయిన్ మాత్రం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దానికి అక్క‌డ ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరే కార‌ణం. అక్క‌డున్న అంద‌రూ విష‌ణ్ణ వ‌ద‌నంతో ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్ జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్ మాత్రం న‌వ్వుతూ గ‌డిపింది. అక్క‌డ‌కొచ్చిన వారిని న‌వ్వుతూ ప‌లుక‌రిస్తూ ఏదో సినిమా ఫంక్ష‌న్‌కు వ‌చ్చిన‌ట్టు బిహేవ్ చేసింది. దీంతో నెటిజ‌న్లు జాక్వ‌లిన్‌పై విమ‌ర్శ‌లు కురిప‌స్తున్నారు. `సినిమా వాళ్లంద‌రూ అక్క‌డ‌కి శ్రీదేవి మీద ప్రేమ‌తో వ‌స్తే.. జాక్వ‌లిన్ మాత్రం ప‌బ్లిసిటీ కోసం వ‌చ్చింద‌`ని నెటిజ‌న్లు వ్యాఖ్య‌నిస్తున్నారు.

ఓ విషాద సంఘటన జరిగినప్పుడు ఆ ఘటనకు హాజరైన వేళ.. ఒక నటి తన తోటి నటికి ఇచ్చే నివాళి ఇదేనా ? శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతున్నట్టు జాక్విలిన్ కు తెలియదా లేక తెలియనట్టు నటించిందా ? కావాలనే నవ్విందా ? ఓ మహానటికి నువ్విచ్చే గౌరవమిదేనా ? నువ్వేమైనా ఓ అవార్డ్ షో కు వచ్చినట్టు ఫీలవుతున్నావా ? నీకు విచారం లేకపోతే నీ యూజ్ లెస్ ఫార్మాలిటీస్ చూపుకోవడానికి అసలు రానే రావద్దు అంటూ చాలామంది తిట్టిపోశారు. అయితే శ్రీదేవి అంత్యక్రియల తరువాత జాక్విలిన్ తన ట్వి టర్ లో ఆమెకు నివాళి అర్పిస్తూ.. శీదేవిని పీపుల్స్ స్టార్ గా అభివర్ణించింది.

English Title
sridevis funeral jacqueline fernandez spotted smiling

MORE FROM AUTHOR

RELATED ARTICLES