శ్రీదేవి అంకితభావానికి హాట్సాఫ్

Submitted by arun on Fri, 03/09/2018 - 15:37
Sridevi Mahesh Bhatt

అందాల అతివ.. అతిలోక సుందరి.. శ్రీదేవి మరణించి చాలా రోజులు గడుస్తున్నా.. బాలీవుడ్ దర్శకులు, ప్రముఖులు, సినీ పెద్దలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. తేరుకోలేకపోతున్నారు. ఆమెతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా.. ఈ జాబితాలో.. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ చేరిపోయారు.

గతంలో.. గుమ్రాహ్ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు.. వర్షంలో హీరోయిన్ తడుస్తూ చేయాల్సిన ఓ సీన్ ఉందట. అప్పుడు శ్రీదేవి జ్వరంతో బాధపడుతోందని.. తాజాగా ఓ సందర్భంలో మహేష్ భట్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు షూటింగ్ వాయిదా వేద్దామని తాను శ్రీదేవిని అడిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

కానీ.. తన కారణంగా షూటింగ్ వాయిదా వేస్తే.. మిగిలిన అందరికీ ఇబ్బంది అని శ్రీదేవి గట్టిగా వారించిందట. షూటింగ్ వాయిదా సమస్యే లేదని.. డూప్ అవసరం కూడా లేకుండా తానే నటిస్తానని చెప్పి.. సీన్ పూర్తి చేసిందట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న మహేష్ భట్.. శ్రీదేవి అంకిత భావానికి మరోసారి సెల్యూట్ చెప్పారు.

అంతటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. ఆమె మహానటి అయ్యిందని.. శ్రీదేవి మన మధ్య లేకున్నా.. ఇంకా మనం తలుచుకుని ఆవేదన పడడానికి అది కూడా ఒక కారణమని అన్నారు. నిజమే కదా మరి.
 

English Title
"Sridevi Was So Professional, I Salute Her Spirit," Mahesh Bhatt Remembered His Gumrah Actress

MORE FROM AUTHOR

RELATED ARTICLES