మిధున్‌తో శ్రీదేవి వివాహం ఓ మిస్టరీ..?

Submitted by arun on Sun, 02/25/2018 - 13:44
sm

నాలుగేళ్ల వయసులో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఇంతలా సినిమాల్లో రాణిస్తుందని బహుశా ఆమె తల్లిదండ్రులు కూడా కలలో ఊహించి ఉండరేమో?. అలా బాలనటి నుంచి అతిలోక సుందరి వరకూ తన అందచెందాలతో నటించి మెప్పించి ఇండియా స్టార్ హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఆదివారం తెల్లవారు జామున (ఫిబ్రవరి-24న) గుండెపోటుతో మరణించారు.

అయితే ఆమెపై వచ్చిన వదంతులు మరోసారి వెలుగుచూశాయి. 1980లో హీరో మిథున్ చక్రవర్తితో ప్రేమాయణంపై పెద్దఎత్తున వదంతులు వచ్చాయి. శ్రీదేవి-మిథున్ మధ్య ‘రహస్యంగా పెళ్లి’ జరిగిందని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అంతేకాదు ‘పెళ్లి సర్టిఫికెట్‌’తో అప్పటి సినీ పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత ఈ పుకార్లను ఇద్దరూ తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరం 1996లో బోనీ కపూర్‌తో శ్రీదేవి వివాహం జరిగింది. బోనీని పెళ్లిచేసుకున్న 7 నెలల తర్వాత 1997 జనవరిలో శ్రీదేవీ ప్రకటించారు. బోనీకపూర్‌‌కు అప్పటికే పెళ్లి అయింది. మొదటి భార్య పిల్లలు అన్షులా, అర్జున్ కపూర్ సొంత సంతానంలా శ్రీదేవి చూసుకున్నారు.

English Title
sridevi secret marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES