హోటల్‌లో మరణించడంతోనే ప్రక్రియ ఆలస్యం

Submitted by arun on Mon, 02/26/2018 - 08:51
Sridevi

అందాలతార శ్రీదేవి పార్థివదేహం ఈరోజు మధ్యాహ్నంలోపు ముంబై చేరుకోనుంది. అయితే శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలో తరలించడంలో తీవ్ర జాప్యం జరిగింది. దుబాయ్‌లో నిబంధనలు అత్యంత కఠినతరంగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. శ్రీదేవి ఆస్పత్రిలో కాకుండా హోటల్‌లో మరణించడంతో శవపరీక్షలతోపాటు ఫోరెన్సిక్‌ టెస్టులు నిర్వహించి వైద్యుల రిపోర్ట్‌ వచ్చాకే మృతదేహాన్ని అప్పగించారు. దాంతో నిన్నే ముంబై చేరుకోవాల్సిన శ్రీదేవి భౌతికకాయం ఆలస్యంగా ఈరోజు మధ్యాహ్నంలోపు ముంబై చేరుకోనుంది.
  
లెజండరీ యాక్టర్, అందాలతార శ్రీదేవి పార్ధివదేహాన్ని ముంబైకి తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. దుబాయ్ రషీద్ ఆస్పత్రిలో శ్రీదేవి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయినా మృతదేహం అప్పగింతలో అధికారులు, పోలీసులు జాప్యం చేశారు. డెత్ సర్టిఫికెట్ విడుదలతోపాటు దౌత్యపరమైన ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. 

శ్రీదేవి భౌతికకాయం ఆదివారం అర్థరాత్రే ముంబై చేరుకుంటుందని ముందుగా భావించారు. అయితే దుబాయ్‌లో జరగాల్సిన పోలీసు లాంఛనాల కారణంగా ఆలస్యం జరిగింది. ఎందుకంటే దుబాయ్‌లో నిబంధనలు కఠినతరంగా ఉండటం శ్రీదేవి ఆస్పత్రిలో కాకుండా హోటల్‌లో మరణించడంతో శవపరీక్షలు పూర్తయి పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాకే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. డెత్‌ సర్టిఫికెట్ వచ్చాక మాత్రమే శ్రీదేవి భౌతికకాయాన్ని బంధువులకు అప్పగించిన దుబాయ్‌ పోలీసులు మృతదేహానికి ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు కూడా చేయించినట్లు తెలుస్తోంది.

శ్రీదేవి పార్థివదేహాన్ని తీసుకురావడానికి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన ప్రైవేటు జెట్ విమానం దుబాయ్ వెళ్లింది. దుబాయ్‌లో లాంఛనాలన్నీ ముగిశాక అతిలోక సుందరి భౌతికకాయంతో చార్టర్డ్ ఫ్లైట్ ముంబై చేరుకోనుంది. యూఏఈలోని భారత రాయబారి నవదీప్ సింగ్ శ్రీదేవి భౌతికదేహాన్ని ముంబైకి తరలించడంలో సహాయపడ్డారు. ఇక శ్రీదేవి భౌతికకాయం కోసం కపూర్ పరివారమంతా ఎదురుచూస్తోంది. శ్రీదేవిని కడసారి చూసేందుకు ముంబై అంధేరిలోని ఆమె ఇంటికి అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దాంతో శ్రీదేవి ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English Title
sridevi postmortem compleeted dubai

MORE FROM AUTHOR

RELATED ARTICLES