శ్రీదేవి కోసం కంగనా ఏం చేసిందో తెలుసా?

Submitted by arun on Mon, 03/05/2018 - 17:51
kangana

అతిలోక సుందరి శ్రీదేవిని ఇష్టపడని వారు.. ఆరాధించని వారు.. ఆమె చనిపోయిందంటే ఏదో కోల్పోయామని బాధ పడేవారు ఎవరు కాదు చెప్పండి? అందులో ఒకరే.. మన వెర్సటైల్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె కూడా చిన్నపుడు శ్రీదేవిని విపరీతంగా ఆరాధించేదట. అప్పుడు ఓ ట్యూబ్ లైట్ ప్రకటనలో వచ్చే శ్రీదేవిని చూసేందు కోసం కంగనా చాలా ఆరాటపడేదట.

అంతే కాదు. యాడ్ లో ఉన్న శ్రీదేవిని ఇంటికి తీసుకురావాలని కూడా గొడవ చేసిందట. పేరెంట్స్ కుదరదని చెప్పడంతో.. టీవీని కూడా పగలగొట్టాలని అనుకుందట. శ్రీదేవి హఠాన్మరణాన్ని తట్టుకోలేకపోయిన కంగనా.. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదనకు గురైంది. శ్రీదేవి లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్టు చెప్పింది.

బోనీకపూర్ తో పాటు.. జాన్వి, ఖుషీ లను కూడా పరామర్శించి ధైర్యం చెప్పింది. ఇలా.. శ్రీదేవిపై తనకున్న అభిమానాన్ని శ్రీదేవి చాటుకుంది.

English Title
Sridevi death Kangana Ranaut met Sridevi’s family

MORE FROM AUTHOR

RELATED ARTICLES