బిచ్చమెత్తుకోవడం... పూజారితో కొట్టించుకోవడం జాతర స్పెషల్‌

Submitted by arun on Mon, 01/29/2018 - 13:29

భిక్షాటన చేస్తూ మొక్కులు చెల్లించుకోవడం పూజారితో భక్తులు కొట్టించుకోవడం ఇలా ఎన్నో విశేషాలు, వింతలు కలిగివున్న అద్భుతమైన జాతర.. తూర్పుగోదావరి జిల్లాలోని సత్తెమ్మ తల్లి జాతర. కొప్పవరంలో కర్రి వంశీయుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న సత్తెమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్ల కొకసారి జరిగే వేడుకల్లో స్థానికులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చిన అమ్మవారిని దర్శించుకుంటారు. 

 అన్ని జాతరలకు భిన్నంగా వుండటం ఈ జాతర  స్పెషాలిటీ. మూడ్రోజుల పాటు జరిగే జాతరలో ప్రతి రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది.  అమ్మవారికి ప్రతిరూపమైన కత్త్రి కుండను మిద్దపై నుంచి దింపడంతో ఈ జాతర మొదలవుతుంది. కత్త్రి కుండను తలపై ధరిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ కుండను తలపై ధరించేందుకు వచ్చిన మహిళలతో ఆలయ ప్రాంగణం ఏటా కిటకిటలాడుతుంటుంది.  

ఈ జాతర్లో మరో ప్రత్యేకత ఏటంటే అమ్మవారికి మేకలను, గొర్రెలను సమర్పిస్తారు. వేరే ఆలయాల్లో మేకలు బలి ఇవ్వడం చూస్తాం కానీ ఇక్కడ పెంచుతారు. సత్తెమ్మతల్లిని నాగదేవతగా కొలిచే భక్తులు విచిత్ర వేషాలు ధరించి.. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. పుట్టనుంచి వచ్చే దారిలో అసలైన సందడి మొదలవుతుంది. పూజరీకి కోపం తెప్పించి.. ఆయనతో దెబ్బలు తినడం ఇక్కడ ఆచారం. పూజారితో కొరడా దెబ్బలు తింటే అమ్మ కరుణిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.

జాతరకు మరో వన్నెతెచ్చే అంశం.. బిక్షాటన.. ఏదో ఒక విచిత్ర వేషం ధరించి ఇక్కడ భక్తులు భిక్షాటన చేస్తారు.  కోరికలు తీరిన కోటీశ్వరులు కూడా ఇక్కడ అమ్మవారికి భిక్షాటన చేసే మొక్కులు చెల్లించాల్సివుంటుంది. ఎందుకంటే భక్తుల జేబులో వున్న డబ్బు, బంగారు ఆభరణాలు కానుకలుగా ఇస్తే సత్తెమ్మ తల్లి ఆగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఇలా భిక్షాటన చేస్తారు. అలా వచ్చిన భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయాన్ని అమ్మవారి హుండీలో వేస్తారు. ఉన్నత ఉద్యోగులు, రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భిక్షాటన చేయడం విశేషం.

English Title
Sri Sathemma Ammavari Jatara Celebrations In East Godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES