నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..

నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..
x
Highlights

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా...

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు కొన్ని బయటకు వచ్చాయి.

ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నటి శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్-2లో పార్టిసిపేట్ చేయబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. నానిపై కూడా శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. మరోసారి హీరో నాని పై ఆరోపణలు చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది . ”నాని కి నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది …… ఏం చేద్దాం నాని మరి ??” అంటూ తాజాగా నాని పై మళ్ళీ ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి .

Show Full Article
Print Article
Next Story
More Stories