పవన్ మ్యాటర్ డిఫరెంట్.. నా గురించి మాట్లాడితే తాట తీస్తా: శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 04/21/2018 - 11:09
sp

పవన్ పై శ్రీరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. పవన్ ను తిట్టమని శ్రీరెడ్డికి తానే సలహా ఇచ్చానని వర్మ స్వయంగా స్టేట్ మెంట్ ఇవ్వడం....దానిపై పవన్ ఈ రోజు తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడం వంటి పరిణామాల గురించి విదితమే. అయితే తనకు సంబంధించిన అంశంపై ఇంత జరుగుతోన్నప్పటికీ...శ్రీరెడ్డి పెదవి విప్పలదు. దాదాపు 20 గంటల నుంచి ఇటు ఫేస్ బుక్ లో కానీ అటు మీడియా చానెళ్లతో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా శ్రీరెడ్డి తన మౌన ముద్రను వీడింది. తన ఫేస్ బుక్ ఖాతాలో  వరుస పోస్టులతో విరుచుకుపడింది. పవన్ కల్యాణ్ మ్యాటర్ డిఫరెంట్ అని.. ఆయనకు నేడు క్షమాపణ చెబుతామని శ్రీరెడ్డి తెలిపింది. తన గురించి మాట్లాడితే తాట తీస్తానని ఫేస్‌బుక్ ద్వారా హెచ్చరించింది. ‘‘ఈ రోజు వరకూ నన్ను ఇరిటేట్ చేసినా, ఎక్స్‌ప్లాయిట్ చేసినా వారిపై మాత్రమే నేను నిందారోపణ చేశా. అనవసరంగా నా పర్సనల్ లైఫ్‌పైన ఎవరు మాట్లాడినా తాట తీస్తా.. లీగల్‌గా ఇరుక్కోకుండా ఉండటం మంచిది. కేసులు పెట్టిన తర్వాత ఏడిస్తే ఉపయోగం లేదు. పవన్ మ్యాటర్ పూర్తిగా వేరు. నేడు దీనిపై మేము వివరణ ఇస్తాం అలాగే క్షమాపణ కూడా చెబుతాం’’ అని పోస్ట్ పెట్టింది.
 
మరో పోస్టులో ‘‘నా పర్సనల్ లైఫ్ మీద అబద్ధాలతో కూడిన ప్రచారం చేస్తున్న వారికి, లీగల్ కేసులు పెరుగుతాయి. వెంటనే వీడియోలు తీయించకపోతే బాగోదు. దీనిపై నేను ఇక మాట్లాడను. మీపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. హెరాస్ చేయడం ఆపండి. నన్ను మనసికంగా హింసించే హక్కు, నన్ను విమర్శించే హక్కు, అబద్దాలతో ప్రచారం చేసే హక్కు మీకు లేదు. ఊరుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు. మీకు లీగల్ ఫైట్ తప్పదు. కబడ్దార్ కల్యాణి, గాయత్రి.. త్వరలో మరికొన్ని పేర్లు చెబుతా’’ అంటూ శ్రీరెడ్డి వెల్లడించింది.

English Title
Sri-Reddy-Responds-on-Pawan-Kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES