logo

నిజమైన హీరో పరిటాల రవి...గడ్డం పెంచి గట్టిగా ప్రసంగిస్తే చెగువేరా? : శ్రీరెడ్డి

నిజమైన హీరో పరిటాల రవి...గడ్డం పెంచి గట్టిగా ప్రసంగిస్తే చెగువేరా? : శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఓ పక్క సినిమా వాళ్లను తిడుతూనే మరోపక్క రాజకీయాలపై కూడా కామెంట్లు చేస్తుంది ఈ నటి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వివాదాలకు దారి తీస్తోంది. శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి' అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై జనసేన అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top