చెన్నైలో సంచలన ప్రకటన చేసిన శ్రీరెడ్డి...

Submitted by arun on Tue, 08/21/2018 - 09:17
sri

తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీరెడ్డి ఎలాంటి సంచలనమో అందరికి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. సినీప్రముఖులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. తనకు తానుగా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల తమిళ మీడియాలో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ మాట్లాడుతూ... శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని చెప్పారు. శ్రీరెడ్డి మాట్లాడుతూ... తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సహకరించేందుకు నడిగర్‌ సంఘం హామీ ఇచ్చిందని చెప్పింది. కాస్టింగ్‌ కౌచ్‌పై తన ఆరోపణల జాబితా కొనసాగుతుందని, తనను లైంగికంగా వాడుకున్న వారి వీడియో ఆధారాలన్నీ తన వద్దే ఉన్నాయని తెలిపింది. ‘రెడ్డి డైరీ’ చిత్రం ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు బాంబు పేల్చింది.
 

English Title
Sri Reddy a Chennaiite now

MORE FROM AUTHOR

RELATED ARTICLES