సచిన్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..!

Submitted by arun on Tue, 09/11/2018 - 13:09
Sri Reddy, Sachin Tendulkar

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి.. ఇటీవల కోలీవుడ్ ప్రముఖులపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. కాగా, ఇప్పుడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఇక్కడ సచిన్‌ను రొమాంటిక్‌ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి..  ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడని కొత్త వివాదానికి తెరలేపారు. ప్రధానంగా సచిన్‌కు ‘ చార్మింగ్‌’ ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడంలో చాముండేశ్వరి స్వామి మధ్య వర్తిత్వం వహిస్తాడని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వేదికగా పేర్కొన్నారు. గొప్ప వ‍్యక్తులుగా ఉన్న వాళ్లు.. రొమాన్స్‌ బాగా చేస్తారన్నారు.

English Title
sri reddy allegations on Sachin Tendulkar

MORE FROM AUTHOR

RELATED ARTICLES