శ్రీకాంత్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేశాడంటున్న భార్య శ్రీహర్ష!

Submitted by arun on Sat, 09/22/2018 - 12:19
death

భార్యను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్లిపోవడం, ఆమె చేత అక్రమ కేసులు పెట్టించడంతో పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతని భార్య శ్రీహర్ష శ్రీకాంత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. మీడియాకు ఓ ఆడియోను విడుదల చేసిన శ్రీహర్ష తనను మోసం చేసి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడని, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన శ్రీకాంత్ ఇంటికి పిలిచి మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీశాడని ఆరోపించింది. ఆ నగ్న ఫొటోలతో నిత్యం బెదిరించేవాడని ఆమె ఆరోపించింది. అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెబుతోంది. స్నేహితులకు తన నగ్న ఫొటోలను పంపిన శ్రీకాంత్, వారి కోరికను కూడా తీర్చాలని తనపై ఒత్తిడి చేశాడని శ్రీహర్ష తెలిపింది. ఆర్య సమాజ్ లో తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని వెల్లడించింది. గతంలోనూ ఇలా కొంతమంది యువతులను శ్రీకాంత్ మోసం చేశాడని ఆరోపించింది. కాగా, ఈ ఆరోపణలను శ్రీకాంత్ తల్లిదండ్రులు ఖండించారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే శ్రీహర్ష అబద్ధాలు చెబుతోందనీ విమర్శించారు.
 

English Title
sri harsha reacts on her husband srikanth demise

MORE FROM AUTHOR

RELATED ARTICLES