కూతురిపై నటుడు విజయకుమార్‌ ఫిర్యాదు

కూతురిపై నటుడు విజయకుమార్‌ ఫిర్యాదు
x
Highlights

ఇళ్లు ఖాళీ చేయడం లేదంటూ తన కుమార్తెపై ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ళుగా వ‌నిత‌, విజ‌య్ కుమార్...

ఇళ్లు ఖాళీ చేయడం లేదంటూ తన కుమార్తెపై ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మధురవాయిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ళుగా వ‌నిత‌, విజ‌య్ కుమార్ కుటుంబాల మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతుండ‌గా, బుధ‌వారం ఇది మ‌రోసారి బ‌హిర్గ‌తైమంది. వివ‌రాల‌లోకి వెళితే విజ‌య్ కుమార్ అల‌పాక్క‌మ్‌లోని అష్ట‌ల‌క్ష్మీ న‌గ‌ర్ 11వ వీధిలో ఉన్న త‌న ఇంటిని అప్పుడప్పుడు షూటింగ్‌ల‌కి ఇస్తున్న‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో త‌న కూతురు షూటింగ్ కోసం ఇల్లు అద్దెకి అడ‌గ‌డంతో ఇచ్చాన‌ని విజ‌య్ కుమార్ అన్నారు. అయితే షూటింగ్ పూర్తైన త‌ర్వాత కూడా విజ‌య్ కుమార్ కూతురు వ‌నిత ఇల్లు ఖాళీ చేయ‌క‌పోగా న్యాయ‌వాదులు,రౌడీల‌తో బెదిరింపులకి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్‌ పోలీస్‌మిషనర్‌ విచారణ చేస్తున్నారు. కాగా గురువారం పోలీసులు విజయకుమార్‌ ఇంటికి వెళ్లి కేసు విషయమై వనితను విచారించగా ఈ ఇంట్లో తనకు భాగం ఉందని, అందువల్ల తాను కాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు ఇల్లు మీదనడానికి ఆధారాలుంటే చూపాలని చెప్పారు. వనిత పోలీసులతో వాగ్వాదం చేస్తున్న విషయం గురించి తెలియడంతో మీడియా వాళ్లు అక్కడికి చేరారు. దీంతో వనిత మీడియా వాళ్లపై తిరగబడింది. కొందరు ఫొటోగ్రాఫర్ల కెమెరాలను లాగి నేలకేసి కొట్టింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పోలీసులు విజయకుమార్, వనితల కేసును విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories