మ‌రోసారి క‌లిసిన టాలీవుడ్ టాప్ స్టార్స్

Submitted by arun on Sat, 07/28/2018 - 11:08
strs

టాలీవుడ్ టాప్ హీరోస్ మ‌హేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లు ఈ మ‌ధ్య ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తున్నారు. పార్టీస్‌లోనో లేదంటే ఏదైన అకేష‌న్‌లోనో ఈ ముగ్గురు హీరోల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫ్యామిలీస్‌తో క‌లిసి మ‌రీ పార్టీల‌కి హాజ‌ర‌వుతున్న వీరు క‌లిసి ఫోటోల‌కి ఫోజులిస్తున్నారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండడంతో అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోతున్నాయి. భ‌ర‌త్ అనే నేను మూవీ ఆడియో వేడుక త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల‌లో క‌లిసిన ముగ్గురు హీరోలు తాజాగా వంశీ పైడిప‌ల్లి బ‌ర్త్‌డే వేడుక‌లో క‌లిసారు. ఈ ముగ్గురి హీరోల‌తో వంశీ పైడిప‌ల్లి ఫోటో దిగాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. జూలై 27 దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ఓ గ్రాండ్ పార్టీని ఇచ్చారు. ఈ పార్టీకి మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరై అందరినీ మరోసారి ఆశ్చర్యపరిచారు. వంశీపైడిపల్లితో వారు దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక వంశీ పైడిపల్లితో ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమా చేస్తే, రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం చేశారు. మహేష్ తన 25వ చిత్రాన్ని ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే చేస్తున్నారు.
 

English Title
Spotted: Mahesh, NTR and Ram Charan

MORE FROM AUTHOR

RELATED ARTICLES