పుట్టినరోజే కళ్యాణం ఎందుకు?
శ్రీరామ నవమి అంటే రాముని పుట్టినరోజు. కానీ భద్రాచలంలో ఆ రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతోంది? ఎవరు నిర్ణయించారు? చైత్రశుద్ధ నవమి రోజునే ఎందుకు కళ్యాణం నిర్వహిస్తున్నారు?
భద్రాచలంలో రాముడు ఎప్పుడు వెలిశాడో ఎవరికీ తెలీదు. కానీ చైత్రశుద్ధ నవమి రోజున అంటే శ్రీరామనవమినాడే భద్రాచలంలో రాముని కల్యాణం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోజే రాముని కళ్యాణం జరుపుతున్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? భక్త రామదాసుగా కీర్తిపొందిన మన తెలుగువాడు కంచర్ల గోపన్నే.
భద్రాచలం పరగణాకు తహశీల్దారుగా పనిచేస్తున్న కాలంలోనే అంటే 400 ఏళ్ల క్రితం ఈ విషయంపై రామదాసు తన గురువు రఘునాద్ భట్టార్‌తోపాటు ప్రముఖ పండితులతో చర్చ నిర్వహించినట్టు తెలుస్తోంది. పాంచరాత్ర ఆగమశాస్త్రంలో యశ్య అవతార దివశే.. తస్య కల్యాణ ఆచరేత్.. అంటే అవతారం జరిగినరోజునే కల్యాణం చేయాలి.. అనే శ్లోకం ప్రకారం రాముడు పుట్టిన చైత్రశుద్ధ నవమి రోజునే కల్యాణం జరగాలని పండితులు రామదాసుకు సూచించారు.
పండితులు సూచించిన ప్రకారం చైత్రశుద్ధ నవమినాడు అభిజిర్లగ్నంలో.. అంటూ సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చినప్పుడు కల్యాణం జరుగుతుంది. రామరాజ్యంలో ప్రజాజీవనాన్ని గుర్తుకుతెస్తూ ప్రతి ఏటా భద్రాచలంలో ఇలా కల్యాణం జరుపుతారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT