గ్రామ వాలంటీర్ల నియామక నోటిఫికేషన్ వచ్చేసింది..మహిళలకు 50శాతం..

గ్రామ వాలంటీర్ల నియామక నోటిఫికేషన్ వచ్చేసింది..మహిళలకు 50శాతం..
x
Highlights

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి...

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి విధివిధానాలు విడుదల చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ప్రభుత్వం ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయనుంది. ఆగస్ట్ ఫస్ట్ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి పంద్రాగస్ట్‌ రోజున విధుల్లో చేరేలా నియామక పత్రాలు అందించనుంది.

పరిపాలనను సులభతరం చేస్తూ, ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 50శాతం ఉద్యోగాలను మహిళలకు కేటాయించారు. అలాగే కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం స్థానికులకే అవకాశమని స్పష్టంచేసింది. అభ్యర్ధులు ఏ గ్రామంలో అప్లై చేసుకుంటారో ఆ గ్రామవాసే అయ్యుండాలని జీవోలో తేల్చిచెప్పింది. దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించిన ప్రభుత్వం పట్టణాల్లో డిగ్రీ... గ్రామాల్లో ఇంటర్‌... గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్త్ అర్హతగా నిర్ణయించారు. అలాగే జూన్ 30 నాటికి 18 నుంచి 35ఏళ్లు ఉన్నవారే అర్హులుగా జీవోలో పేర్కొంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 5వేల రూపాయల గౌరవ వేతనంతో నియామక పత్రాలు అందించనున్నారు.

జిల్లాల వారీగా గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. జూన్ 24నుంచి జులై 5వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్లను ఎంపిక చేయనున్న ప్రభుత్వం అందుకోసం మండల, పట్టణస్థాయిలో అధికారులతో సెలెక్షన్‌ కమిటీలు ఏర్పాటు చేయనుంది. జులై 10వరకు దరఖాస్తులు పరిశీలించి జులై 11నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆగస్ట్‌ 1న ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదలచేసి ఆగస్ట్ 5 నుంచి 10 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. పంద్రాగస్ట్‌ రోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు బాధ్యతలు చేపట్టనున్నారు.

గ్రామ వాలంటీర్లగా ఎంపికైన అభ్యర్ధులను 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించనున్నారు. తమ పరిధిలో ఉండే కుటుంబాల సమస్యలను వినతులను గ్రామ సచివాలయానికి అందజేయడంతోపాటు ఆయా పథకాల లబ్ధిదారుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా నవరత్నాలు అమలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను గడపగడపకూ అందించడమే లక్ష్యంగా గ్రామ వాలంటీర్లు పనిచేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories