జెట్ విమానాల‌న్నీ పాక్షికంగా ర‌ద్దు !

జెట్ విమానాల‌న్నీ పాక్షికంగా ర‌ద్దు !
x
Highlights

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో తీవ్ర న‌ష్టాల ఊబిలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకాలాపాలు మూత పడనున్నాయని ...

జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో తీవ్ర న‌ష్టాల ఊబిలో ఉన్న జెట్ ఎయిర్‌వేస్ జెట్‌ ఎయిర్‌వేస్ కార్యకాలాపాలు మూత పడనున్నాయని తెలుస్తోంది. ఆ సంస్థ‌కు చెందిన విమానాలు అన్నీ తాత్కాలికంగా ర‌ద్దు అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలో జెట్ సంస్థ బోర్డ్ మీటింగ్ జరిగింది. కానీ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. జెట్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నాలు విమాన‌యాన‌శాఖ చేసినా ఫ‌లితం లేకుండాపోయింది. ఆ సంస్థ‌కు ఎమ‌రెన్సీ నిధులు ఇచ్చేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. అయితే జెట్‌ఎయిర్‌వేస్‌ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. జెట్ సంస్థ సుమారు 8 వేల కోట్ల అప్పుల ఉబిలోఉంది. ప్ర‌స్తుతం ఆ కంపెనీకి చెందిన ప‌ది విమానాలు మాత్ర‌మే సేవ‌లు అందిస్తున్నాయి. ఇక నుండి ఆ విమానాలు కూడా ఎగ‌ర‌వ‌ని తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ వ్య‌వ‌స్థాప‌కుడు న‌రేశ్ గోయ‌ల్‌, ఆయ‌న భార్య అనితా గోయ‌ల్‌.. గ‌త నెల‌లో సంస్థ‌కు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories