సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ మూడో ఘట్టం

సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ మూడో ఘట్టం
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టం ఈరోజు పూర్తికానుంది. 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ నియోజకవర్గాలకు మరికాసేపట్లో పోలింగ్ జరగనుంది. అంతేకాదు ఏఐసీసీ...

సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టం ఈరోజు పూర్తికానుంది. 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ నియోజకవర్గాలకు మరికాసేపట్లో పోలింగ్ జరగనుంది. అంతేకాదు ఏఐసీసీ అధ్యక్షుడు రాహు‌ల్‌గాంధీతోపాటు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా మూడో దశ పోలింగ్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టం ఈరోజు పూర్తికానుంది. 14 రాష్ట్రాల్లో 115 లోక్‌సభ నియోజకవర్గాలకు మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభంకానుంది. అసోంలో 4, బీహార్‌లో 5, ఛత్తీస్‌‌గఢ్‌లో 7, గుజరాత్‌లో 26, గోవాలో 2, జమ్మూకశ్మీర్‌లో 1, కర్నాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిషాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, దాద్రా హవేలీలో 1, డయ్యూలో 1, పశ్చిమబెంగాల్‌లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో దశలో వాయిదాపడ్డ త్రిపుర ఈస్ట్‌కు కూడా ఇవాళే పోలింగ్ జరగనుంది.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహు‌ల్‌గాంధీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా‌తో పాటు ఎంతో మంది ప్రముఖులు మూడో దశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌ మధ్య రాంపూర్‌ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్శిస్తోంది. అలాగే కేంద్ర మంత్రి మేనకాగాంధీకి పట్టున్న పిలీభీత్‌ నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెయిన్‌పురి నుంచి ములాయం బరిలో నిలిచారు. ఇక మమతాబెనర్జీ అడ్డా బెంగాల్‌లో థర్డ్ ఫేజ్‌ పోలింగ్‌ జరుగుతున్న 5 స్థానాల్లో 40శాతం వరకు ముస్లింలు ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇక దేశమంతా ఆసక్తిగా చూస్తున్న మరో కీలక రాష్ట్రం గుజరాత్‌లో మరోసారి మోడీ మ్యాజిక్‌ రిపీట్ అవుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ఈవీఎంల మొరాయింపు ఘర్షణల మధ్య రెండు దశలను కంప్లీట్ చేసిన ఎన్నికల సంఘం ఇవాళ్టి మూడో దశ పోలింగ్‌‌కు విస్తృత ఏర్పాట్లు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories