వైసీపీకి ఢిల్లీనుంచి పిలుపు నిర్ణయం తీసుకుంటారా?

వైసీపీకి ఢిల్లీనుంచి పిలుపు నిర్ణయం తీసుకుంటారా?
x
Highlights

వైసీపీకి ఢిల్లీనుంచి పిలుపు అందింది. ఈనెల 29 న అందుబాటులో ఉండాలని పార్లమెంట్ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో పార్టీ అధినేత జగన్ అందుబాటులో ఉన్న...

వైసీపీకి ఢిల్లీనుంచి పిలుపు అందింది. ఈనెల 29 న అందుబాటులో ఉండాలని పార్లమెంట్ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో పార్టీ అధినేత జగన్ అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో భేటీ అయ్యారు.. ఇంతకీ వైసీపీని పిలిచిన విషయం ఏమిటంటే.. ప్రత్యేక హోదా సాధన కోసమని వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ప్రధానమంత్రి తిరుపతి సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజి అంటూ చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో మొదటినుంచి హోదాకోసం పోరాడుతున్న వైసీపీ కాస్త దూకుడు పెంచింది. ఈ క్రమంలో తమ ఎంపీల చేత రాజీనామా చేయించింది. ఇక వీరి రాజీనామాలను పరిశీలించిన స్పీకర్ సదరు ఎంపీలను ఈనెల 29 న హాజరు కావాల్సిందింగా లోక్సభ స్పీకర్ కార్యాలయం ఆదేశించింది. వారిని పిలిచి మొదటగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సూచిస్తుంది స్పీకర్.ఒకవేళ ఆలా కాకుండా తమ రాజీనామాలు ఆమోదించాలని పట్టుబడితే మాత్రం వారం పది రోజుల్లో వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుని అవకాశముంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్ణయం ఎటువైపు ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories