కాంగ్రెస్‌‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ...కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పిన భూపాలపల్లి ఎమ్మెల్యే

కాంగ్రెస్‌‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ...కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పిన భూపాలపల్లి ఎమ్మెల్యే
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌...

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమైన గండ్ర దంపతులు త్వరలో కారెక్కనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన గండ్ర టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పేశారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమైన గండ్ర దంపతులు అనంతరం కాంగ్రెస్‌‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణను నెంబర్‌‌వన్‌గా తీర్చిదిద్దుతూ, అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపిన గండ్ర ఎన్నికల సమయంలో తన నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకే టీఆర్‌ఎస్‌తో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే గండ్ర టీఆర్‌ఎస్‌లో చేరకుండా టీకాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీపీసీసీ చీఫ్‌ ‌ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తదితరులు ఇంటికెళ్లి చర్చలు జరిపినా గండ్ర దంపతులు పట్టించుకోలేదు.

గండ్ర రాజీనామాతో ఇప్పటివరకు కారెక్కిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంఖ్య 11కి చేరింది. ఇదే బాటలో మరికొందరు ఉన్నారనే ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్‌లో అసలు ఎంతమంది మిగులుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇక సభలో కాంగ్రెస్‌ బలం సింగిల్ డిజిట్‌కి పడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories