బీజేపీ, మోడీపై విరుచుకుపడ్డ సోనియాగాంధీ

Submitted by arun on Fri, 03/09/2018 - 16:18
Sonia Gandhi

రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాక సెలైంట్‌గా ఉంటూ వస్తోన్న సోనియాగాంధీ బీజేపీపైనా, మోడీపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోడీ కంటే మన్మోహన్‌ పాలనే వెయ్యి రెట్లు బాగుందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సోనియా ఆవేదన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ వ్యవహారాలపై వాజ్‌పేయికి అమితమైన గౌరవం ఉండేదని గుర్తుచేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ వేధింపులకు గురవుతోందన్న సోనియాగాంధీ  ప్రజలను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ప్రతీ పథకానికీ ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తున్నారని ఆరోపించారు. ఈ నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న బీజేపీని 2019లో మళ్లీ అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. 

English Title
Sonia Gandhi fire on bjp government

MORE FROM AUTHOR

RELATED ARTICLES