తొలిసారి నీ పక్కన లేను.. సోనాలి బింద్రే భావోద్వేగ పోస్ట్

Submitted by arun on Sat, 08/11/2018 - 16:17
Sonali Bendre, Ranveer

తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన సోనాలీ బింద్రే హై గ్రేడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం తన కుమారుడు రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. 13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకును పొగడ్తలో ముంచెత్తిన సోనాలీ.. తొలిసారి రణ్‌వీర్ పుట్టిన రోజున అతడికి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

‘రణ్‌వీర్‌.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కాస్త ఎక్కువ భావోద్వేగానికి‌ గురవుతున్నానేమో. అయినా సరే.. నీ 13వ పుట్టినరోజుకు ఆ అర్హత ఉంది. వావ్‌.. ఇప్పుడు నువ్వు టీనేజర్‌వి. ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కాస్త సమయం పడుతుంది. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీకు నా అమితమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది..’ అని సోనాలి పోస్ట్‌లో పేర్కొన్నారు.

సోనాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కొన్ని రోజుల క్రితం ఆమె భర్త గోల్డీ బెహల్‌ పేర్కొన్నారు. ఆమెపై చూపుతున్న ప్రేమకు అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని సోనాలి అన్నారు. సినీ ప్రముఖులు, స్నేహితులు సైతం ఆమెకు ధైర్యం చెప్పారు.

English Title
Sonali Bendre wishes son Ranveer on his birthday in an emotional post

MORE FROM AUTHOR

RELATED ARTICLES