సోనాలి బింద్రేకు మాటిచ్చాను: న‌మ్ర‌త‌

Submitted by arun on Wed, 10/31/2018 - 16:28
Bendrenamrata

ఒక‌ప్ప‌టి అందాల తార సోనాలి బింద్రే హైగ్రేడ్ మెటా స్టేటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా, ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతుంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న‌ `మ‌హ‌ర్షి` షూటింగ్ కూడా ప్ర‌స్తుతం న్యూయార్క్‌లోనే జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ భార్య న‌మ్ర‌త తాజాగా సోనాలీని క‌లిశారు. ఈ విషయాన్ని నమ్రత ఆంగ్ల ‘మీడియా ద్వారా వెల్లడించారు.`సోనాలీతో కాసేపు స‌ర‌దాగా గ‌డిపాను. త‌న అనారోగ్యానికి సంబంధించిన చాలా విష‌యాలు ఆమె నాకు చెప్పారు. కేన్స‌ర్ చికిత్స తీసుకుంటున్న‌ప్ప‌టికీ సోనాలీ చాలా ఫిట్‌గా ఉన్నారు. ఆమె దృఢ‌మైన మ‌హిళ‌. ఆమె నాతో చాలా విష‌యాలు మాట్లాడారు. మేమిద్ద‌రం సెంట్ర‌ల్ పార్క్‌లో వాకింగ్ చేయాల‌నుకున్నాం. కానీ కొన్ని ప‌నుల వల్ల నాకు కుద‌ర‌లేదు. త్వ‌ర‌లో మ‌ళ్లీ కలుస్తాన‌ని, సెంట్ర‌ల్ పార్క్‌లో వాకింగ్‌కు వ‌స్తాన‌ని సోనాలీకి మాటిచ్చాను. నేను మ‌ళ్లీ సోనాలీని క‌లుస్తాన‌`ని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త పేర్కొన్నారు.

English Title
Sonali Bendre is a strong girl, ready to get back to normal life, says Namrata Shirodkar

MORE FROM AUTHOR

RELATED ARTICLES