గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై కమిటీ నివేదిక సమర్పణ...అతి ప్రచారంతోనే పుష్కర ప్రమాదం...

Submitted by arun on Wed, 09/19/2018 - 12:21
Godavari pushkaralu

గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ తేల్చిచెప్పింది. అతి ప్రచారం కారణంగానే రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ దగ్గర తొక్కిసలాట జరిగిందని స్పష్టం చేసింది. అతి ప్రచారానికి మీడియానే కారణం నివేదికను బయటపెట్టింది. గోదావరి పుష్కరాల తొక్కిసలాట ఘటనపై జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ సమర్పించిన  నివేదికను ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ ముందుకు తెచ్చింది. 2015లో 144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి హద్దుమీరిన ఉత్సాహంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ముహూర్త కాలంపై విస్తృత ప్రచారమే ప్రమాదానికి ప్రధాన కారణమని, ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని తెలిపింది. పత్రికలు, ఛానెళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది.

English Title
somayajulu commission report godavari pushkar ghat accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES