'స్కెచ్' టీజ‌ర్‌.. దీపావ‌ళికి

స్కెచ్ టీజ‌ర్‌.. దీపావ‌ళికి
x
Highlights

విక్ర‌మ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'స్కెచ్‌'. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ త‌మిళ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్...

విక్ర‌మ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'స్కెచ్‌'. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ త‌మిళ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కుతున్న 'స్కెచ్‌'లో.. త‌మ‌న్నా డీ గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ని అక్టోబ‌ర్ 18 సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. సినిమాని డిసెంబ‌ర్ 22న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 'అప‌రిచితుడు' చిత్రం విడుద‌లై ప‌న్నెండేళ్లవుతున్నా.. మ‌రో హిట్‌ని త‌న సొంతం చేసుకోలేక‌పోయిన విక్ర‌మ్ ఈ చిత్రంతోనైనా హిట్ కొడ‌తాడేమో చూడాలి. తెలుగులోనూ 'స్కెచ్' పేరుతోనే ఈ సినిమా అనువాద‌మ‌య్యే అవ‌కాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories