పెళ్లి చేసుకోబోతున్న సింగర్‌ సునీత?

Submitted by arun on Thu, 07/19/2018 - 11:15
singer sunitha

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. ప్రేక్షకులను మైమరిపించే గానం మాత్రమే కాదు, ఆకట్టుకునే రూపం కూడా ఆమె సొంతం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీతకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తాజాగా ఆమెకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

త్వరలో ఆమె మరో పెళ్లి చేసుకోనున్నారని చెబుతున్నారు. సింగర్ గా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలకు పని చేసిన సునీత.. త్వరలోనే పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అయితే ఆమెకు కాబోయే భర్త ఎవరు? అన్నదానిపై మాత్రం ఎక్కడా స్పష్టత లేదు. ఈ వార్తపై సింగర్‌ సునీత ఎలా స్పందిస్తారో చూడాలి. చిన్నతనంలోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆమె.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె భర్త నుంచి చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. కొన్నేళ్లుగా సింగిల్ మదర్ గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సునీత.. తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ వాదన మొత్తం సోషల్ మీడియానే తప్పించి.. ఆమె స్వయంగా ప్రకటించింది లేదు. రెండో వివాహంపై గతంలో కొన్ని ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. అలాంటి ఆలోచనేం లేదని చెప్పటం తెలిసిందే. అయితే మనసు మార్చుకున్న ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారంటూ కొన్ని కథనాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కథనాలపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

English Title
Singer Sunitha to marry again

MORE FROM AUTHOR

RELATED ARTICLES