డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టాలీవుడ్ సింగర్...

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టాలీవుడ్ సింగర్...
x
Highlights

జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 178 ఎంజీ...

జూబ్లిహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో చెక్‌ చేస్తే 178 ఎంజీ వచ్చింది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చే రోడ్డులో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ తాగిన మైకంలో కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం మోతాదు 178 పాయింట్లు వచ్చింది. రాహుల్ పోలీసులకు సహకరించకుండా వాగ్వివాదానికి దిగాడు. అతనిపై కేసు బుక్ చేసి.. కారును సీజ్ చేశారు. ఆ సమయంలో యాంకర్‌, నటుడు లోబో కూడా రాహుల్‌తో ఉన్నారు. లైసెన్స్‌ కూడా లేకుండానే రాహుల్‌ సిప్లిగంజ్ కారు నడిపినట్టు తెలుస్తోంది. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. ఇటీవలే రంగస్థలం టైటిల్‌ సాంగ్‌ కూడా రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories