‘జగన్‌ను సీఎం చేసేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తా’

Submitted by arun on Thu, 07/05/2018 - 16:47
sidda

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వారసుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. సిద్ధార్థరెడ్డి ఈనెల 7న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డితో విభేదాలు లేవని అన్నారు. జగన్‌ను సీఎం చేసేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తానని సిద్దార్థరెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నందికొట్కూరులో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. తనపై అక్రమ కేసులు బనాయించారన్నారు. జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సిద్దార్థరెడ్డి పేర్కొన్నారు.

English Title
Siddarth Reddy is all set to join YSR Congress Party

MORE FROM AUTHOR

RELATED ARTICLES