కవిత అందుకే ఓడిపోయారు: కేటీఆర్‌

కవిత అందుకే ఓడిపోయారు: కేటీఆర్‌
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్‌ కనిపించిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌ లో పలు అంశాలపై...

సార్వత్రిక ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్‌ కనిపించిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌ లో పలు అంశాలపై స్పందించిన ఆయన ఈ ఫలితాలు టీఆర్‌ఎస్‌కేమీ ఎదురుదెబ్బ కాదన్నారు. అభ్యర్థుల ఎంపిక సక్రమంగా లేదనడం సరికాదన్నారు కేటీఆర్‌. హరీశ్‌రావును ఈ ఎన్నికల్లో పక్కనపెట్టామనడంలో నిజంలేదని చెప్పారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వచ్చిన ఓట్ల శాతం కన్నా ఈసారి ఆరు శాతం ఓట్లు పెరిగినా, 9 సీట్లే గెలిచామని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కుంగిపోవాల్సిన పనిలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలపై లోతైన సమీక్ష చేస్తామని చెప్పారు.

నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదన్నారు కేటీఆర్. నిజామాబాద్‌లో నామినేషన్లు వేసింది రైతులు కాదని, రాజకీయ కార్యకర్తలేనని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి కాబట్టే నిజామాబాద్ లో కవిత ఓడిపోయిందని తెలిపారు. తానుగానీ, కవితగానీ ఒక్క ఓటమితో కుంగిపోమని రాహుల్ ఓడిపోయారని, కాంగ్రెస్ కార్యకర్తలు దుప్పట్లో కప్పుకుని ఇంట్లో పడుకుంటారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ గెలిచిన మూడు ఎంపీ సీట్లలో రెండు సీట్లను స్వల్ప ఆధిక్యంతో గెలిచిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించే స్థితిలో లేదని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్ఎస్ కు నష్టం జరిగిందనే వాదన సరికాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సాంకేతికంగా టీఆర్ఎస్ లో చేరలేదని తెలిపారు.

ఆదిలాబాద్ సీటు గెలుస్తామని బీజేపీ కూడా ఊహించి ఉండదన్నారు కేటీఆర్. మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిత్వం బీజేపీకి ఓటింగ్ పెరగడానికి కారణమని ఆ పార్టీకి కార్యకర్తలు లేని చోట కూడా ఓట్లు పడ్డాయని కేటీఆర్ చెప్పారు. శేరిలింగంపల్లి లాంటి నియోజకవర్గంలో కూడా బీజేపీ 50వేల ఓట్లు పడ్డాయని తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories